ప్రధాని మోదీకి విశాఖలో పార్టీ తరపున ఘన స్వాగతం, రోడ్ షో నిర్వహిస్తాం – ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

AP BJP Chief Somu Veerraju Announces Party Plans For Grand Welcome and Road Show During PM Modi Vizag Tour on Nov 11, Mango News, Mango News Telugu, Modi Inaugurating Several Development Projects, Modi Tour To Visakhapatnam, national news, National Politics, PM Modi Tour Live Updates, PM Modi Visakhapatnam Tour, PM Modi Vizag Tour Schedule Finalized For Launching of Several Project Works on November 11, PM Narendra Modi Visakhapatnam Tour, PM Narendra Modi will Visit Visakhapatnam, Prime Minister Modi Visakhapatnam Tour, Prime Minister Modi Visakhapatnam Tour on Nov 11th, Prime Minister Visakhapatnam Tour, Visakhapatnam Latest News And Updates

ఈనెల 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన విశాఖపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటన వివరాలు, పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, విశాఖలో రైల్వే జోన్‌ సహా విశాఖలో జరుగనున్న పలు కార్యక్రమాలకు అందరిని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలనేది బీజేపీ విధానమని, మూడు రాజధానుల పేరుతో మోసం చేస్తున్న వారిని ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ని కూడా ఆహ్వానిస్తారా అంటే వీర్రాజు సమాధానం దాటవేయడం గమనార్హం.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పార్టీ తరపున చేపట్టనున్న కార్యక్రమాలు..

  • ప్రధాని మోదీ ఈనెల 11 సాయంత్రం 6:25 కు విశాఖ విమానాశ్రయంలో దిగుతారు.
  • ఆయనకు పార్టీ తరపున ఘన స్వాగతం పలికి, అనంతరం రోడ్ షో నిర్వహిస్తాం.
  • రోడ్ షో కోసం రెండు రూట్లు ఎంపిక చేశాం. వీటిలో ఒకదానిని కేంద్ర పార్టీ ఈరోజు ఫైనలైజ్ చేస్తుంది.
  • వీటిలో ఒకటి ఎన్ఎడి వద్ద పాత ఐటిఐ నుంచి, రెండోది బీచ్ రోడ్ నుంచి.
  • 12 ఉదయం ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్సులో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్టారు.
  • ఈ క్రమంలో ఒక బహిరంగ సభలో కూడా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.15 కు బయలుదేరి వెళతారు.
  • కేంద్రం ఇంతకాలం ఎన్నో పధకాలకు నిధులు ఇవ్వగా అవన్నీ పూర్తయ్యాయి. వాటిని దేశానికి అంకితం చేస్తారు.
  • ఇక ఏపీలో బీజేపీ పార్టీ అయిదువేల ఎస్సీ బస్తీల్లో సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + thirteen =