ఏపీలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

17 IPS Officers transferred in Andhra Pradesh, 17 IPS Officers transferred in AP, Andhra Pradesh, Andhra Pradesh Latest News, Andhra Pradesh News Today, AP News, AP Political Updates, Mango News Telugu, Search Results Web results Andhra Pradesh government transfers 17 IPS officers

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీ జరిగింది. 17 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూన్ 13, శనివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును రైల్వేస్‌ డీజీపీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయవాడ సీపీగా బీ.శ్రీనివాసులను నియమించారు.

ఏపీలో జరిగిన ఐపీఎస్ ల బదిలీల వివరాలు:

  • విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా బి.శ్రీనివాసులు నియామకం
  • రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు
  • ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్.బాలసుబ్రహ్మణ్యం
  • గుంటూరు అర్బన్‌ ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి
  • గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్నీ
  • శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్
  • విశాఖ రూరల్ ఎస్పీగా బి క్రిష్ణా రావు
  • ఎస్ఐబీ ఎస్పీగా అట్టాడ బాబూజీ
  • సీఐడీ ఎస్పీగా నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌
  • పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా నారాయణ నాయక్‌
  • విజయవాడ రైల్వే ఎస్పీగా సి.హెచ్‌.విజయారావు
  • మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్ గా ఎం దీపిక కు అదనపు బాధ్యతలు
  • రోడ్‌ సేఫ్టీ ఏడీజీపీగా కృపానంద్‌ త్రిపాఠి ఉజాలా
  • ఎస్‌ఈబీ డైరెక్టర్‌గా పి.హెచ్‌.డి.రామకృష్ణ
  • డీజీపీ ఆఫీస్‌ అడ్మిన్‌ ఏఐజీగా బి.ఉదయ్‌ భాస్కర్‌
  • విశాఖ డీసీపీ1 గా ఐశ్వర్య రాస్తోగి
  • డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఎస్‌.రంగారెడ్డికి ఆదేశాలు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =