ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ప్రభుత్వ సాయానికి హామీ ఇచ్చిన మంత్రి జోగి రమేష్‌

AP Minister Jogi Ramesh Assures Govt Assistance For Horticultural Crops Damaged by Cyclone in The State, Minister Jogi Ramesh Assures Govt Assistance For Horticultural Crops Damaged by Cyclone in The State, AP Govt Assistance For Horticultural Crops Damaged by Cyclone in The State, Assistance For Horticultural Crops Damaged by Cyclone in The State, AP Minister Jogi Ramesh, Minister Jogi Ramesh, Jogi Ramesh, AP Minister for Housing, Housing Minister, Housing Minister Jogi Ramesh, Horticultural Crops Damaged by Cyclone, Horticultural Crops, Cyclone, AP Horticultural Crops News, AP Horticultural Crops Latest News, AP Horticultural Crops Latest Updates, AP Horticultural Crops Live Updates, Mango News, Mango News Telugu,

కృష్ణా జిల్లాలో ఇటీవలి అసాని తుఫాన్ ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడి రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసి అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటామని జోగి రమేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 8,22,994 హెక్టార్లలో రబీ సీజన్‌లో అనేక రకాల పంటలు సాగయ్యాయని, తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 16,997 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. అసాని తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 30,000 హెక్టార్లలో వ్యవసాయం మరియు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. వరి 30,225 హెక్టార్లలో పూర్తిగా తడిసిన స్థితిలో ఉంది. మొక్కజొన్న 6,095 హెక్టార్లలో, మినుము 3,882 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. అలాగే వేరుశెనగ 875 హెక్టార్లలో, నువ్వులు 589 హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లగా, పొద్దుతిరుగుడు 200 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు. మరోవైపు పత్తి, చెరకు, రాగులు వంటి తదితర సంప్రదాయ పంటలు కూడా వర్షం ప్రభావంతో బాగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 4 =