నర్సాపూర్ నుంచి ఎంపీగా శ్యామలాదేవి పోటీ?

Syamaladevi Contest as MP from Narsapur, Syamala Devi, YCP MP Ticket, CM Jagan, AP Elections, MP from Narsapur, Syamaladevi from Narsapur, Narsapur MP Syamaladevi, Latest Narsapur MP News, Latest MP Elections News, Andra Pradesh, YCP Elections News, Political News, AP, Mango News, Mango News Telugu
Syamala devi, YCP MP Ticket, CM Jagan, AP Elections

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రావడంతో పాటు.. అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రజాబలం తగ్గిన వారిని.. పనితనం బాగోలేని వారిని.. ఎంత సీనియర్ అయినా ఉపేక్షించడం లేదు. సీనియర్లను కూడా పక్కకు పెట్టి కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుని ఈసారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈక్రమంలో నర్సాపూర్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించిన జగన్.. చివరికి శ్యామలా దేవిని నర్సాపూర్ అభ్యర్థిగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రఘరామ కృష్ణ రాజును చిత్తుగా ఓడించాలంటే శ్యామలా దేవి సరైన అభ్యర్థి అని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. శ్యామలాదేవిని బరిలోకి దించడం ద్వారా ప్రభాస్ అభిమానులు కూడా తమ వైపు తిరుగుతారని.. తద్వారా నియోజకవర్గంలో జనసేన ప్రభావాన్ని తగ్గించవచ్చని జగన్ అనుకుంటున్నారట.

వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాపై కృష్ణం రాజు కుటుంబానికి మంచి పట్టు ఉంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు కాకినాడ, రాజమండ్రిల నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్రం మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఈరోజు (జనవరి 20) కృష్ణం రాజు జయంతి సందర్భంగా శ్యామలాదేవి తమ సొంత గ్రామమైన మొగల్తూరులో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్యామలాదేవి మాట్లాడుతూ వైద్య శిబిరం తర్వాత తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.

ఈక్రమంలో శ్యామలాదేవి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె వైసీపీ హైకమాండ్‌తో కూడా సంప్రదింపులు జరిపారని.. జగన్ నుంచి ఎంపీ టికెట్ హామీ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నర్సాపూర్ ఎంపీ టికెట్ శ్యామలదేవికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో వైద్య శిబిరం తర్వాత శ్యామలాదేశి తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఏం ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + twelve =