జనసేనలో చేరనున్న వైసీపీ ముఖ్య నేత

YSRCP Key Leader From Rayalaseema Likely To Join Jana Sena in Soon,YSRCP Key Leader From Rayalaseema,Key Leader To Join Jana Sena in Soon,YSRCP Key Leader Likely To Join Jana Sena,Mango News,Mango News Telugu,Jagan, Rayalaseema, YCP chief leader, Jana Sena,YSRCP Key Leader Latest News,YSRCP Key Leader Latest Updates,YSRCP Key Leader Live News,Jana Sena Latest News,Jana Sena Latest Updates,YSRCP Latest News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ తన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీలకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత ఒకరు జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే వైసీపీ అడ్డాగా భావించే చోట జగన్ పునాది కదిలినట్టే అని చెప్పవచ్చు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఈసారి గట్టిగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటంలో వెనుకాడమని అంటున్నారు. ఒకరకంగా అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. దీంతో జనసేన పట్ల ఆదరణ పెరుగుతోంది. అందుకే కీలక నేతలు పవన్‌తో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

జనసేనకి పట్టున్న ఉత్తరాంధ్రలో ఇప్పటికే పవన్ పర్యటనకు విశేష ఆదరణ దక్కింది. ఇదే ఊపుతో రాయలసీమలో పవన్ యాత్రకి సిద్ధమయినట్టు తెలుస్తోంది. గతంలో పవన్ రాయలసీమలో పర్యటించినప్పుడు మంచి ఆదరణ దక్కింది. ఈసారి అదేస్థాయి ఆదరణ దక్కుతుందని జనసేన నమ్ముతోంది. వాస్తవానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాంతాలకు అతీతంగా సమస్యల మీద పోరాడుతున్నారు. ఇక జనసేన ఏదైనా సమస్య మీద ఫోకస్ చేస్తే అధికార పార్టీ ఆ సమస్యని వెంటనే పరిష్కరిస్తోంది. దీనిని బట్టి పవన్ పవర్ ఏంటో అర్థమవుతోంది. అందుకే పవన్‌తో కలసి అడుగులు వేయడానికి కీలక నేతలు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఎదో ఒక సమస్యపై జనసేన పోరాటం చేస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఆదేశించడం, జనసైనికులు రంగంలోకి దిగి పని పూర్తి చేస్తుండటంతో నాలుగేళ్లలో అధికార వైసీపీకి పక్కలో బల్లెంలా తయారైంది. జనసేన పోరాటానికి సీమ నేతలు సైతం సలాం కొడుతున్నారు .

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేన నాయకులు రకరకాల పోరాటాలు చేస్తున్నారు. ఇలా ఇతర పార్టీల నేతలు జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోనూ జనసేన బలోపేతం అవుతోంది. వాస్తవానికి ధర్మవరంలో రాజకీయం చేయాలంటే కాస్త కష్టమే అంటారు. కరుడుగట్టిన రాజకీయ నాయకులు ఈ గడ్డమీద రాజకీయాలు చేయడమే దీనికి కారణం. అధికార వైసీపీ లీడర్‌ని ఎదురుకోవడం అంత సులభం కాదు. పొలిటికల్ పవర్‌తో ప్రతిపక్ష లీడర్లని ఇబ్బంది పెట్టడం , ప్రత్యర్థుల రాజకీయ జీవితం మీద కొట్టడం అక్కడి అధికార పార్టీ నేత స్టైల్ అని అంటారు. అయితే ఎమ్మెల్యే ఎత్తులను, జిత్తులను తట్టుకొని జనసేన లీడర్ మధుసూదన్ రెడ్డి సమర్థవంతగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే దాడులు, కేసులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జనసేన క్యాడర్‌ని పెంచుతున్నారు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే అనంతపురంలో ఓ ముఖ్య వైసీపీ నేత సైతం జనసేన సిద్దాంతాల కోసం పని చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పవన్ వారాహి యాత్ర రాయలసీమలో మొదలైతే ఆ నేత చేరడం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే ఇతర జిల్లాల్లోనూ పలువురు అధికార పార్టీ నేతలు జనసేన వైపు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో రాయలసీమలో జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని అంటున్నారు విశ్లేషకులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 7 =