సెప్టెంబర్ 24న ఎంపీపీలు, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణ

AP SEC, AP SEC Released Notification For Election Of ZP Chairmans, AP SEC Released Notification For Election Of ZP Chairmans and MPPs, AP SEC releases notification for election of Zilla, AP SEC releases notification for election of Zilla Parishad, Latest News on MPTC ZPTC elections, Mango News, SEC issues notification for MPP ZPP chiefs posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరోక్ష పద్ధతిలో జిల్లా పరిషత్‌ (జెడ్పీ) చైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్షులు(ఎంపీపీ), ఉపాధ్యక్షులు మరియు కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబర్ 24న ఎంపీపీ, సెప్టెంబర్ 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ముందుగా ఆయా రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కో-ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నిక చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, ఉపాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

మండల పరిషత్‌ అధ్యక్షులు(ఎంపీపీ), ఉపాధ్యక్షులు ఎన్నిక (సెప్టెంబర్ 24) :

  • ప్రత్యేక సమావేశం నిర్వహణకు నోటీసులు జారీ: సెప్టెంబర్ 20, సోమవారం లేదా ముందుగానే
  • కో-ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక : సెప్టెంబర్ 24
  • ఎంపీటీసీల ప్రమాణస్వీకారం, కో-ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నిక సమయం : సెప్టెంబర్ 24, మధ్యాహ్నం 1 గంటకు
  • ఎంపీపీ, ఉపాధ్యక్షులు ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహణ: సెప్టెంబర్ 24, మధ్యాహ్నం 3 గంటలకు
  • 24న ఈ ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో సెప్టెంబర్ 25న పూర్తి.

జిల్లా పరిషత్‌ (జెడ్పీ) చైర్మన్‌, ఇద్దరు వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక (సెప్టెంబర్ 25) :

  • ప్రత్యేక సమావేశం నిర్వహణకు నోటీసులు జారీ: సెప్టెంబర్ 21, మంగళవారం లేదా ముందుగానే
  • ఇద్దరు కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక : సెప్టెంబర్ 25
  • ఎంపీటీసీల ప్రమాణస్వీకారం, ఇద్దరు కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక సమయం : సెప్టెంబర్ 25, మధ్యాహ్నం 1 గంటకు
  • జెడ్పీ చైర్మన్‌, ఇద్దరు వైస్‌ ఛైర్మన్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహణ: సెప్టెంబర్ 25, మధ్యాహ్నం 3 గంటలకు
  • 25న ఈ ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో సెప్టెంబర్ 26న పూర్తి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =