ఏపీలో జూన్ 2 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. కీలక సూచనలు జారీ చేసిన విద్యాశాఖ

AP SSC Advanced Supplementary Exams to be Held June 2 Time Table as Follows Here,AP SSC Advanced Supplementary Exams,Supplementary Exams to be Held June 2,SSC Supplementary Held June 2,AP SSC Time Table as Follows,AP SSC Supplementary Exams,Mango News,Mango News Telugu,AP SSC Supplementary Latest News,AP SSC Supplementary Latest Updates,AP SSC Supplementary Live News,AP SSC Supplementary Time Table,AP SSC Latest News,AP SSC Live Updates,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏపీ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఎస్సీ) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జూన్ 2న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఈ పరీక్షలకు మొత్తం 2,12,221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 915 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఏపీలో ఈనెల 6న పదో తరగతి ఫలితాలు ప్రకటించబడ్డాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 72.26గా నమోదైంది. 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల కోసం విద్యాశాఖ ఇప్పటికే హాల్ టిక్కెట్లను జారీ చేసింది. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకూ నిర్వహించనున్నారు.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగు తేదీలు..

 • జూన్ 2 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I(కాంపోజిట్ కోర్స్) 70
 • జూన్ 3 రెండవ భాష 100
 • జూన్ 5 ఇంగ్లీష్ 100జూన్ 6 గణితం 100
 • జూన్ 7 సైన్స్ 100
 • జూన్ 8 సామాజిక అధ్యయనాలు 100
 • జూన్ 9 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్స్) 30
 • జూన్ 9 OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం, అరబిక్, పర్షియన్) 100
 • జూన్ 10 OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం, అరబిక్, పర్షియన్) 100

విద్యార్థులకు కీలక సూచనలు..

 • ఉదయం 8.45 నుంచి 9.30 లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతించరు.
 • తెలంగాణలో ఐదు నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. 9:35 గంటలకు గేట్లు మూసివేస్తారు.
 • విద్యార్థులు తమ వెంట మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమేరాలు, ఇయర్‌ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు వంటివి తీసుకెళ్లకూడదు.
 • వాటర్‌ బాటిల్‌, పెన్‌, పెన్సిల్‌, ఇతర స్టేషనరీని సెంటర్‌లోకి తీసుకెళ్లవచ్చు.
 • అత్యవసర పరిస్థితుల్లో మినహా పరీక్ష పూర్తయ్యేవరకూ విద్యార్థులను బయటకు పంపరు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here