టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం.. 37 మంది నిందితుల శాశ్వత డిబార్‌

TSPSC Takes Severe Action by Debar Permanently The 37 Accused From Writing Any Exam in Future,TSPSC Takes Severe Action,TSPSC Debar Permanently The 37 Accused,TSPSC Debar From Writing Any Exam in Future,Mango News,Mango News Telugu,Telangana State Public Service Commission,SIT begins probe,TSPSC Question Paper Leak,TSPSC debars 37 candidates,TSPSC Latest News,TSPSC Latest Updates,TSPSC Live News,TSPSC 37 Accused Latest News,TSPSC Severe Action News Today,TSPSC Severe Action Latest News

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న 37 మంది నిందితులు భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా శాశ్వతంగా డిబార్ చేసింది. టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ ఈ మేరకు ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసిన 37 మందిని డిబార్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. అలాగే వారికి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కాకుండా సాంకేతికంగా చర్యలు తీసుకుంటోంది. కమిషన్ నిర్ణయాన్ని అనుసరించి, అరెస్టయిన వ్యక్తులు భవిష్యత్తులో ఎలాంటి టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయడానికి అనర్హులు అవుతారు. 37 మందిని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ కోరుతూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని అందులో అధికారులు కోరారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిట్‌ 44 మందిపై కేసు నమోదు చేయగా, 43 మందిని అరెస్టు చేసింది. త్వరలోనే మిగిలిన అభ్యర్థుల విషయంలోనూ ఇదే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

కాగా పేపర్ లీకేజీ కేసులో మైక్రోచిప్‌లు, ఇయర్‌బడ్స్‌తో కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ప్రశాంత్, నరేష్, మహేష్‌లతో సహా ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. వరంగల్‌కు చెందిన ఇంధన శాఖ డీఈ రమేష్‌ టీఎస్‌పీఎస్సీ టెక్నీషియన్‌ సురేష్‌ నుంచి పేపర్‌ కొనుగోలు చేసి కోచింగ్‌ సెంటర్‌లో దాదాపు 20 మంది సభ్యులకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ఈ అభ్యర్థులు పరీక్షకు 10 నిమిషాల ముందు చేరుకున్నారు మరియు ఎగ్జామినర్ సహాయంతో, ఏఈఈ పేపర్‌ను వాట్సాప్‌లో పంచుకున్నారు. ఈ క్రమంలో రమేష్‌ను రెండు రోజుల క్రితమే అరెస్టు చేయగా, డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. డీఈ పేపర్‌ను కనీసం 20 మంది సభ్యులతో పంచుకుని వారి నుంచి భారీగా డబ్బులు కూడా వసూలు చేసినట్లు సమాచారం. అర్హత సాధించి టాప్ మార్కులు సాధించిన అభ్యర్థులపై సిట్ దృష్టి సారించింది. మార్చి 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన పరీక్షను TSPSC రద్దు చేసింది. టౌన్ ప్లానింగ్ పరీక్షను మార్చి 12న నిర్వహించాల్సి ఉంది. అదేవిధంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షను మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే టీఎస్‌పీఎస్‌సీలోని కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని తొలుత భావించిన అధికారులు ఆ తర్వాత పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. అలాగే మార్చి 5న జరిగిన ఏఈఈ పరీక్ష లీకైనట్లు పోలీసులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − two =