ఏపీలో జూన్ 12న స్కూల్స్ రీ-ఓపెన్ సందర్భంగా.. విద్యార్థులకు ‘విద్యా కానుక’ కిట్లు అందించనున్న సీఎం జగన్

CM Jagan To Distribute Jagananna Vidya Kanuka Kits on June 12 During Schools Re-Opening in AP,CM Jagan To Distribute Jagananna Vidya Kanuka,Jagananna Vidya Kanuka Kits on June 12,Jagananna Vidya Kanuka Kits During Schools Re-Opening,Schools Re-Opening in AP,Mango News,Mango News Telugu,CM YS Jagan's Vidya Kanuka Kit Distribution,Jagananna Vidya Kanuka,Jagananna Vidya Kanuka Latest News,Jagananna Vidya Kanuka Latest Updates,Jagananna Vidya Kanuka Live News,AP CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

2023-2024 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని 39.95 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్‌లను అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా ఏపీలో జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అదేరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ‘విద్యా కానుక’ కిట్లు అందించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం అధికారులతో కీలక సమీక్ష సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నాటికే విద్యా కనుక కిట్స్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ కిట్‌లలో ఏడాదికి సరిపడా వర్క్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, మూడు సెట్ల దుస్తులు, బ్యాగ్‌లు, బూట్లు మరియు నోట్‌బుక్‌లు ఉంటాయి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ డిస్ట్రిబ్యూటర్ల గోడౌన్ల వద్ద స్కూల్ యూనిఫాం మరియు ఇతర సామగ్రి నాణ్యతను తనిఖీ చేయడంతోపాటు సకాలంలో సరఫరా చేసేలా చూస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి మొత్తం 35,4,61,730 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు ప్రింట్‌ అయ్యాయని, మే 12 నాటికి పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు జిల్లాల్లో పంపిణీ చేయబడి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం 3,9,95,992 యూనిఫాం సెట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు లక్ష సెట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నందున మే 26 నాటికి అన్ని యూనిఫాంలు అందజేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు పరిధిలో కిట్స్ పంపిణీ మానిటరింగ్ కోసం 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here