ఏపీఎస్ఆర్టీసీ కి సంక్రాంతి ఆదాయం రూ.144 కోట్లు

APSRTC, APSRTC Earned Over Rs 144 Crore Revenue, APSRTC Earned Over Rs 144 Crore Revenue-During Sankranti Festival Season, APSRTC earns 144 crore revenue via Sankranti specials, APSRTC earns Rs 13.17 crore during Sankranti festival, APSRTC Latest News, APSRTC News, APSRTC Revenue, APSRTC Revenue-During Sankranti Festival Season, Mango News, Sankranti Festival Season

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో మొత్తం రూ.144 కోట్లు ఆదాయం సమకూరినట్టు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులకు ఎండీ ద్వారకా తిరుమలరావు ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7 నుంచి 18 వరకు ఏపీ, తెలంగాణతో పాటుగా ఇతర ప్రాంతాలకు 5,422 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడిపించిందని చెప్పారు.

ఇందులో ఏపీ నుంచి హైదరాబాద్ కే 1350 బస్సులు నడిపినట్టు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు మొత్తం 12 రోజుల్లో రూ.144 కోట్ల ఆదాయం సమకూరిందని, జనవరి 17న ఒక్కరోజే 36 లక్షల మంది ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడంతో రూ.15.40 కోట్లు ఆదాయం వచ్చిందని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − five =