బూడి ముత్యాల నాయుడుకే టికెట్ ఎందుకు?

Why the Ticket to Budi Mutyala Naidu?, Anakapalli YSRCP MP Candidate, Anakapalli MP Candidate Mutyala Naidu, TDP, YCP, Janasena, Chandrababu, CM Jagan, BJP, Congress, YSRCP, Earle Anuradha, Budi Mutyala Naidu, CM Ramesh, Andhra Pradesh, Political News, Mango News
TDP, YCP, Janasena, Chandrababu, CM Jagan, BJP, Congress, YSRCP,Earle Anuradha, Budi Mutyala Naidu, CM Ramesh

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ..ఇటీవల ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 24ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అయితే  అక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌ పేరును ప్రకటించడంతో..అనకాపల్లి ఎంపీ  అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును ప్రకటించింది.

అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిత్వంపై వైసీపీ అధిష్టానం  సోషల్ ఇంజినీరింగ్ చేసిన తర్వాత ముత్యాలనాయుడిని తమ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్ ఆర్థికంగా బలపడిన వ్యక్తి. దీనికితోడు అనకాపల్లి లోక్‌సభ పరిధిలో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండటంతో..సీఎం రమేశ్ కూడా  ఓసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తమకు కలిసి వస్తాయని బీజేపీ భావించింది.

దీంతో సీఎం రమేశ్‌కు చెక్ పెట్టడానికి ఇప్పుడు  కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును   వైసీపీ అధిష్టానం బరిలోకి దించింది. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేవలం కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మాత్రమే ఉండటంతో..కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బూడి ముత్యాల నాయుడును రంగంలోకి దించింది.

అంతేకాకుండా..మరోవైపు స్థానికత అంశాన్ని కూడా వైఎస్సార్సీపీ తెరపైకి తీసుకు రాబోతున్నట్లు  తెలుస్తోంది. బూడి ముత్యాల నాయుడు స్థానిక నాయకుడు కాగా సీఎం రమేశ్ నాన్ లోకల్ లీడర్ అన్న విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేయబోతోంది. సీఎం రమేశ్ స్వస్థలం వైఎస్ఆర్ కడప జిల్లా కావడంతో.. స్థానికత అంశం కూడా తమ  ఓటు వేసే ముందు కలిసి వస్తుందని భావించిన వైసీపీ..  వ్యూహాత్మకంగా బూడి ముత్యాల నాయుడును తెరపైకి తీసుకువచ్చింది.

ముందు నుంచీ కూడా వైసీపీకి  అత్యంత వీర విధేయుడుగా బూడి ముత్యాల నాయుడుకు పేరుంది. వైసీపీలోనే జెడ్పీటీసీ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగిన నేత. అంతేకాదు ఎవరు పిలిచినా  పలికే వ్యక్తిగా.. మంచితనంలో ఒక అడుగు ముందున్న నాయకుడిగా మాడుగుల నియోజకవర్గంలో పేరుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − one =