ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన బండి సంజయ్.. తెలంగాణ సీఎస్ సహా పలువురికి నోటీసులు

AP CM YS Jagan Mohan reddy, AP CM YS Jagan Mohan Reddy Regarding OTS, Kapu leader Mudragada letter to CM YS Jagan, Kapu leader Mudragada Padmanabham writes to AP CM, Mango News, Mudragada Padmanabham, Mudragada Padmanabham writes to YS Jagan, Mudragada Padmanabham Wrote A Letter To AP CM YS Jagan, Mudragada Padmanabham Wrote A Letter To AP CM YS Jagan Mohan Reddy, Mudragada Padmanabham Wrote A Letter To AP CM YS Jagan Mohan Reddy Regarding OTS, Mudragada writes to AP CM YS Jagan, OTS

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుపై.. తెలంగాణ సీఎస్ కు లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్ స్పెక్టర్లకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. నిన్న లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు.

కరీంనగర్ లో జరిగిన ఘటన వివరాలను వివరించారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కమిటీకి వివరించి చెప్పారు. కరీంనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో.. జాగరణ దీక్షకు దిగగా పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్టు చేశారని కమిటీకి తెలిపారు. ఈ క్రమంలో.. పార్లమెంట్ సభ్యుడిగా తన హద్దులకు భంగం కలిగించారని కమిటికి చెప్పారు. పోలీసులు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని తెలియజేశారు. సంజయ్ స్టేట్మెంట్ నేపథ్యంలో.. ప్రివిలేజ్ కమిటీ అధికారులకు నోటీసులు పంపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =