తిరుమలలో డిక్లరేషన్‌పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ

Declaration for Tirumala Darshan, Tirumala Tirupati, tirumala tirupati devasthanam darshanam, Tirumala Tirupati Devasthanams, TTD, TTD Chairman, TTD Chairman YV Subba Reddy, TTD News, YV Subba Reddy, YV Subba Reddy Gives Clarity over Declaration Issue, yv subba reddy ttd chairman

తిరుమలలో డిక్లరేషన్ అంశంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇచ్చే అవసరం లేదని తాను అనలేదని‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని మాత్రమే చెప్పానని అన్నారు. టీటీడీ చ‌ట్టంలోని రూల్ 136 ప్ర‌కారం హిందూయేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాలని, ఈ నియమానికి టీటీడీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తిరుమలకు వ‌చ్చిన‌పుడు డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ని చెప్పానని, అందువలనే సీఎం వైఎస్‌ జగన్ కూడా డిక్ల‌రేష‌న్ ఇచ్చే అవ‌స‌రం లేద‌ని అన్నానన్నారు. తిరుమల శ్రీవారి మీద మీద సీఎం జగన్ కు అపార‌మైన భ‌క్తివిశ్వాసాలు ఉన్నాయని చెప్పారు. ఓవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగతున్న సమయంలో ఈ అంశంపై అనవసర వివాదాలు సృష్టించవద్దని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − one =