బిగ్ బాస్-3 ఎపిసోడ్-3 హైలైట్స్ – హిమజ భావోద్వేగం,వరుణ్-వితికా రొమాన్స్

Bigg Boss 3 Telugu Contestants Episode 3, Bigg Boss Season 3 Telugu Episode 3 Highlights, Bigg Boss Season 3 Telugu Latest News, Highlights of Bigg Boss Season 3 Telugu Episode 3, Mango News, Nagarjuna Hosting Bigg Boss Season 3 Latest Updates

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. జులై 23 న ప్రసారమైన బిగ్ బాస్ 3 మూడవ ఎపిసోడ్ లో గొడవలు మొదలయ్యాయి, సభ్యుల మధ్య వాదనలు, భావోద్వేగాలతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

ఎపిసోడ్ 3 (జూలై23) హైలైట్స్:

  • బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం మేరకు, నామినేట్ అయినా సభ్యులు ఎలిమినేషన్ ప్రాసెస్ నుండి తప్పించుకోవడానికి, తగిన కారణాలతో ఇతర సభ్యులు పేర్లు చెప్పడం మొదలు పెట్టారు
  • మొదటగా సింగర్ రాహుల్, తన బదులుగా నామినేట్ చెయ్యడానికి శివజ్యోతి( సావిత్రి) ని ఎంచుకున్నాడు, కానీ రాహుల్ చెప్పిన కారణాలు మానిటర్ హేమకు నచ్చకపోవడంతో బిగ్ బాస్ రాహుల్ నే తిరిగి నామినేట్ చేసాడు
  • వరుణ్ సందేశ్ పునర్నవి భూపాలం పేరు చెప్పగా, హేమ ఏకీభవించి పునర్నవి ని నామినేట్ చేసింది
  • వితికా షెరు తన బదులు అషు రెడ్డి పేరు చెప్పగా, చెప్పిన కారణాలు హేమకు నచ్చకపోవడంతో వితికా షెరునే మళ్ళీ నామినేట్ చేసింది
  • శ్రీముఖి వంతు రాగానే హిమజ పేరు చెప్పి, లివింగ్ రూంలో పెట్టిన బోర్డులో హేమ హిమజ కు ఒక రెడ్ మార్క్ ఇచ్చిందని, అందువల్లే తనను నామినేట్ చేస్తున్నానని చెప్పింది. హిమజ తనకు బాగా తెలుసు అని, లైఫ్ లో తాను ఏదైనా లైట్ గా తీసుకుంటుందని చెప్పింది, అయితే తన పర్సనల్ లైఫ్ తనకేమి తెలుసు అని హిమజ కోప్పడింది, హేమ కూడ శ్రీముఖి బదులు తనకు నామినేట్ చేయడంతో, నేను నిందలు తీసుకోనని హేమతో వాదిస్తూ హిమజ కన్నీరు పెట్టుకుంది, వాదనలు తరువాత కూడా హేమ హిమజనే నామినేట్ చేసింది
  • తరువాత జాఫర్ తన బదులు మహేష్ విట్టా పేరు చెప్పగా, తన కారణాలతో హేమ ఏకీభవించలేదు, జాఫర్ ని నామినేట్ చేసింది
  • ఐదుసార్లు మాత్రమే బెల్ మోగడంతో, మిగిలిన బాబా భాస్కర్ కి తనను తాను నామినేషన్ నుంచి బయట పడేసుకోవచ్చని బిగ్ బాస్ ఆఫర్ ఇస్తాడు
  • హేమ, బాబా భాస్కర్ లలో ఎవరో ఒకరిని నామినేట్ చేయాలనీ బిగ్ బాస్ కోరగా, ఇంటి సభ్యులంతా బాబా భాస్కర్ ని సేవ్ చేసి హేమను నామినేట్ చేసారు
  • చివరికి ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో రాహుల్, పునర్నవి భూపాలం, వితికా షెరు, జాఫర్, హిమజ, హేమ ఉన్నారు
  • ఈ ఎపిసోడ్లో ఇంకా మధ్యమధ్యలో వరుణ్-వితికా రొమాన్స్, బాబా భాస్కర్ తో శ్రీముఖి డాన్సులు, బాబా భాస్కర్ అందరికి దిష్టి తీసే పద్దతి ప్రేక్షకులను ఆకట్టుకొని హైలైట్ గా నిలిచాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here