హైదరాబాద్‌లో చేప మందు పంపిణీని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Minister Talasani Srinivas Yadav Started The Fish Prasadam Distribution In Hyderabad After Three Years Of Covid Break,Minister Talasani Srinivas Yadav,Talasani Srinivas Yadav Started The Fish Prasadam,Fish Prasadam Distribution In Hyderabad,Fish Prasadam After Three Years Of Covid Break,Mango News,Mango News Telugu,Fish Prasadam Distribution Begins,Bathini Family Gears Up For Fish Prasadam,Fish Prasadam Distribution,Fish Prasadam Distribution News,Hyderabad Fish Prasadam,Hyderabad Fish Prasadam Latest News,Hyderabad Fish Prasadam Latest Updates,Hyderabad Fish Prasadam Live News,Minister Talasani Srinivas Latest News,Minister Talasani Srinivas Latest Updates

మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు (శుక్రవారం, శనివారం) చేప మందు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా మూడేళ్ల విరామం తర్వాత చేప మందు పంపిణీ చేస్తుండటం విశేషం. ఈ సందర్భంగా నిర్వాహకులు దాదాపు ఐదు క్వింటాళ్ల చేపలను అందుబాటులో ఉంచారు. ఇక ఈ ఏడాది సుమారు ఐదు లక్షల మంది ప్రజలు చేప ప్రసాదాన్ని పొందుతారని అంచనా వేస్తుస్తున్నారు. బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో గత 177 సంవత్సరాలుగా మృగశిర కార్తె రోజున ఉచితంగా లక్షలాది మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచారు. అలాగే అదనంగా మరో 75 వేల చేప పిల్లలతో పాటు.. అవసరమైతే మరిన్ని చేప పిల్లలను అందించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, చేప మందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అలాగే రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ వంటి దూర రాష్ట్రాల నుంచి వ్యాధిగ్రస్తులు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వద్ద ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 32 క్యూలైన్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తుండగా.. నాంపల్లి గ్రౌండ్ పరిసరాల్లో 700 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే 300 మంది పోలీసులతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 15 =