ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు

CM YS Jagan Congratulates Biswabhusan Harichandan who has been Appointed as the Governor of Chhattisgarh,CM YS Jagan Congratulates,Biswabhusan Harichandan, who has been Appointed,Governor of Chhattisgarh,Mango News,Mango News Telugu,TDP chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,Andhra Pradesh Politics,Andhra Pradesh Political News,Andhra Pradesh,Chandrababu Naidu News and Updates,YSR Congress Party

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులైన రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన్ని గుర్తుంచుకుంటారని అన్నారు. మచ్చలేని వ్యక్తిత్వం హరిచందన్‌ సొంతమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులను దాటుకుని రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి మరువలేని సహకారాన్ని అందించారన్నారు. అధికార కార్యకాలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా, నిండైన హుందాతనంతొ వ్యవహరించారన్నారు

రాష్ట్రం-కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంలో, వాటి మధ్య సంబంధాలు సజావుగా సాగడంలో అత్యంత కీలకపాత్ర పోషించి, రాజ్యాంగానికి వన్నెతెచ్చారన్నారు. తండ్రి వాత్సల్యాన్ని చూపారని, ఆత్మీయతను తెలుగు ప్రజలకు పంచారని సీఎం ప్రశంసించారు. రాష్ట్రం నుంచి ఆయన వెళ్లిపోవడం బాధాకరమైనా, దేశంలో మరో రాష్ట్రానికి ఆయన గవర్నర్‌గా వెళ్లడం అక్కడి ప్రజలకు తప్పకుండా మేలుచేస్తుందని సీఎం వైఎస్ జగన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here