దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం…వివరాలివే

President Droupadi Murmu Appoints New Governors for 13 States,Governor Of Arunachal Pradesh,Governor Of Sikkim,Governor Of Jharkhand,Governor Of Himachal Pradesh,Governor Of Assam,Governor Of Andhra Pradesh,Governor Of Andhra Pradesh Appointed As Governor Of Chhattisgarh,Governor Of Chhattisgarh Appointed As Governor Of Manipur,Governor Of Manipur Appointed As Governor Of Nagaland,Governor Of Bihar Appointed As Governor Of Meghalaya,Governor Of Himachal Pradesh Appointed As Governor Of Bihar,Governor Of Arunachal Pradesh Appointed As Lt. Governor Of Ladakh,Governor Of Jharkhand Appointed As Governor Of Maharashtra,Lt. General Kaiwalya Trivikram Parnaik (Retired),Lakshman Prasad Acharya,C P Radhakrishnan,Shiv Pratap Shukla,Gulab Chand Kataria,S. Abdul Nazeer,Justice (Retd) Biswa Bhusan Harichandan,Anusuiya Uikye,La. Ganesan,Phagu Chauhan,Rajendra Vishwanath Arlekar,Brig (Dr) B D Mishra (Retd),Ramesh Bais

దేశంలో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త గవర్నర్లను నియమించడంతో పాటుగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారిని మరో రాష్ట్రానికి బదిలీ చేశారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోష్యారీ మరియు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధా కృష్ణన్ మాథుర్ చేసిన రాజీనామాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 13 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకంపై రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలు వారు సంబంధిత కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్ల నియామకం:

  1. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
  2. సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
  3. జార్ఖండ్‌ గవర్నర్‌గా సి.పి.రాధాకృష్ణన్‌
  4. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా
  5. అస్సాం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా
  6. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రిటైర్డ్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్
  7. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ బదిలీపై ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
  8. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ సుశ్రీ అనుసూయా ఉక్యే బదిలీపై మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు
  9. మణిపూర్ గవర్నర్ లా.గణేశన్ బదిలీపై నాగాలాండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు
  10. బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ బదిలీపై మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు
  11. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ బదిలీపై బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు
  12. జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ బదిలీపై మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు
  13. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బి.డి.మిశ్రా బదిలీపై లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =