ఏపీలో ధాన్యం సేకరణలో రవాణా ఛార్జీలు సహా గన్నీ బ్యాగుల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది – సీఎం జగన్

CM YS Jagan Held Review on Grain Collection and Kharif Crops in AP Today Gives Several Key Advises, CM YS Jagan Gives Several Key Advises, Review on Grain Collection and Kharif Crops in AP, Review on Kharif Crops in AP, Review on Grain Collection in AP, CM YS Jagan Held Review, CM YS Jagan Key Advises, AP CM YS Jagan Mohan Reddy, Grain Collection, AP Grain Collection News, AP Grain Collection Latest News, AP Grain Collection Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం సేకరణ సమయంలో రవాణా ఛార్జీలు సహా గన్నీ బ్యాగుల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన ధాన్యం సేకరణ మరియు ఖరీఫ్ పంటలపై కీలక సమీక్ష నిర్వహించిన సందర్భంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు చేశారు.

ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • రాష్ట్రంలో ఎక్కడా రైతులు ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు పంటలను విక్రయించే పరిస్థితి రాకూడదు.
  • రైతులకు గరిష్ట ప్రయోజనాలను అందించేలా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తొలగిస్తున్నాం.
  • ఈ-క్రాపింగ్ డేటాను ఉపయోగించి ధాన్యం సేకరణ మరింత పటిష్టంగా కొనసాగాలి.
  • పౌరసరఫరాల శాఖను వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి.
  • ఖరీఫ్ సీజన్ తో పాటు వచ్చే రబీ సీజన్‌కు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలి.
  • రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు తదితర అన్నింటిని అందించేందుకు అధికారులు సిద్ధం కావాలి.
  • ప్రతి ఆర్‌బీకేలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్‌బీకేలలో డ్రోన్‌లను అమర్చాలి.
  • అలాగే ప్రతి ఆర్‌బీకేలో భూసార పరీక్షల పరికరాలను ఉంచాలి.
  • వచ్చే మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
  • రవాణా లేబర్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు పారదర్శకంగా జరగాలి.
  • అలాగే రైతులకు చేసే చెల్లింపులన్నీ నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్ళాలి.
  • ఇక ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన ప్రత్యేక యాప్ లోని సాంకేతిక సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి.
  • ధాన్యం సేకరణ, కొనుగోళ్ల సమాచారాన్ని రైతుల ఫోన్లకు సందేశాలు, వీడియోల రూపంలో పంపించాలి.
  • అలాగే రైతులకు మిల్లెట్స్ వంటి ప్రత్యామ్నాయ పంటలు పండించడంపై అవగాహన కల్పించడంతో పాటు అన్ని విధాలా సహకారం అందించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 16 =