ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులెవరూ తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ఏపీ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Says Outsourcing Employees Need Not To Worry About Their Jobs, Sajjala Ramakrishna Reddy Says Outsourcing Employees Need Not To Worry About Their Jobs, Outsourcing Employees Need Not To Worry About Their Jobs, AP Govt Advisor Sajjala Ramakrishna Reddy, Sajjala Ramakrishna Reddy, AP Govt Advisor, Outsourcing Employees, AP Skill Development Scam, Outsourcing Employees About Their Jobs, AP Skill Development Scam News, AP Skill Development Scam Latest News, AP Skill Development Scam Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్‌లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులెవరూ తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ విభాగంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టిన నేపథ్యంలో సోమవారం ఆయన విజయవాడలో దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తారనే వాదనలను తోసిపుచ్చారు. ఉద్యోగాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యోగులకు సజ్జల భరోసా ఇచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ అనేది చాలా పెద్దదని, దీనిలో తప్పకుండా రాజకీయ ప్రమేయం ఉండే ఉంటుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ స్కామ్‌పై కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడవుతాయని సజ్జల చెప్పారు. ఇక ఈ స్కామ్‌లో చంద్రబాబు నాయుడి పాత్ర ఉండి ఉంటుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకి తెలియకుండా రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ ఎలా జరుగుతుంది? అని సజ్జల ప్రశ్నించారు. పోలవరం జాప్యానికి కారణం చంద్రబాబేనని, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటుంది కూడా ఆయనేనని విమర్శించారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక, ఇప్పుడు సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధిని చూడలేక చంద్రబాబు కుట్రలు చేస్తూ, కోర్టుల్లో కేసులు వేయిస్తూ అడ్డుపడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 8 =