ఏపీలో 2021-22 జాబ్ క్యాలెండర్‌ విడుదల, 10,143 ఉద్యోగాలు భర్తీ

Andhra Pradesh Govt Jobs 2021, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Mohan Reddy To Release Job Vacancies Calender, AP CM YS Jagan Mohan Reddy To Release Job Vacancies Calender Today, AP govt to release job calendar, AP Job Calendar, AP Jobs Calendar, AP Jobs Calendar 2021, CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy to release job calendar, Jagan to unveil job calendar today, Job calendar, Job Vacancies Calender, Mango News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ ను విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. 2021-22 ఏడాదికి గాను వివిధ విభాగాల్లో మొత్తం 10,143 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు క్యాలెండరు ద్వారా ప్రకటించారు. ఇందులో విద్య, వైద్యం, పోలీసు శాఖలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డిఎస్సీ తదితర నియామక సంస్ధల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయనున్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఉద్యోగ నియామకాల విషయంలో అభ్యర్థులు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులను తొలగిస్తున్నామన్నారు. జులై 2021 నుంచి మార్చి 2021 వరకు అనగా వచ్చే తొమ్మిది నెలల కాలంలో ఏఏ ఉద్యోగాలకు, ఏఏ నెలలో నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నామో జాబ్ క్యాలెండర్ రూపంగా ఈ రోజు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ కాలంలో మొత్తం 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని అన్నారు. చదువులు పూర్తి చేసుకున్న వారి కోసం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నామని, దీని ద్వారా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో స్పష్టంగా తెలియజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

ఏపీలో 2021-22 జాబ్ క్యాలెండర్‌ (10,143 పోస్టులు): 

  • జూలై-2021 – ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు – 1,238
  • ఆగస్టు-2021 – ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 – 36
  • సెప్టెంబరు-2021 – పోలీస్‌ శాఖ – 450
  • అక్టోబరు -2021 – వైద్య శాఖ (వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు) – 451
  • నవంబరు-2021 – వైద్య శాఖ (పారామెడికల్‌, పార్మాసిస్ట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్) – 5,251
  • డిసెంబరు-2021 – వైద్య శాఖ (నర్సులు) – 441
  • జనవరి-2022 – విద్యాశాఖ (డిగ్రీ కాలేజీల లెక్చరర్లు) – 240
  • ఫిబ్రవరి-2022 – విద్యాశాఖ (యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు) – 2,000
  • మార్చి-2022 – ఇతర శాఖలు – 36
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + four =