గ్రామాల్లో పర్యటిస్తా, పథకాల అమలు స్వయంగా పరిశీలిస్తా – సీఎం జగన్

AP CM YS Jagan On Rachabanda Program, AP CM YS Jagan Says Rachabanda Program Will Start Soon, AP News, Ap Political News, CM YS Jagan, Rachabanda Program Will Start Soon, Rachabanda Programme, Rachabanda Programme In AP, Rachabanda Programme will Start after Corona Intensity Decrease

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, పాఠశాలల్లో నాడు-నేడు పనులు, పలు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు తగ్గగానే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం ట్వీట్ కూడా చేశారు. “ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవుతున్నాయా లేదా అన్నదాని పై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టాక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తానని” సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై స్పందిస్తూ , పేషంట్ కోవిడ్ కేర్ ఆస్పత్రికి వెళితే “బెడ్ లేదు” అనే మాట ఎట్టిపరిస్థితుల్లో రాకూడదు. ఎవరైనా పేషంట్ “నాకు బెడ్ దొరకలేదు” అంటే అది మన మానవత్వం మీద ప్రశ్నే అవుతుందని సీఎం పేర్కొన్నారు. దేశంలోనే రోజువారీగా 50 వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్‌ జనాభాకు 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 90 శాతం పరీక్షలు కోవిడ్‌ క్లస్టర్లలోనే చేస్తున్నామని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో ముందుకు పోతున్నామని చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =