సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు కన్నుమూత

Veteran Actor Raavi Kondala Rao, Writer Raavi Kondala Rao Passed Away,Raavi Kondala Rao Passed Away ,Raavi Kondala Rao,Tollywood Movie Actor Ravi Kondala Rao,Actor Raavi Kondala Rao Dies,,Veteran Tollywood actor Raavi Kondala Rao dies,Raavi Kondala Rao Death

ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు జూలై 28, మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సినీ రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా రావి కొండలరావు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నటుడిగానే కాకుండా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా సేవలు అందించారు. 600కు పైగా తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయన భార్య, ప్రముఖ నటి రాధాకుమారితో జంటగా పలు చిత్రాల్లో నటించారు. రావి కొండలరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here