కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్లనున్న సీఎం జగన్

Andhra CM Jagan Reddy to go on tour of Foreign Trip, AP CM YS Jagan First Foreign Trip To Jerusalem, Ap cm ys jagan mohan reddy America tour finalized, CM YS Jagan To Go Jerusalem On August 1st Along With Family, CM YS Jagan to visit Jerusalem for four days, Jagan America Tour, Jagan USA Trip Invitation, Mango News, YS Jagan To Go On Foreign Trip

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై నిరంతరాయంగా పని చేస్తున్నారు. ఆగస్ట్ నెలలో కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా పర్యటనకంటే ముందే ముఖ్యమంత్రి జగన్ జెరూసలేం వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే హైదరాబాద్ చేరుకొని,తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్ట్ 1వ తేదీన జెరూసలేం వెళతారు.

ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాక జగన్ మోహన్ రెడ్డి మొదటి పర్యటనగా జెరూసలేం వెళ్తున్నారు, అయితే ఈ పర్యటన పూర్తి వ్యక్తిగతమైనదిగా చెబుతున్నారు. ఈ పర్యటన నాలుగు రోజులు పాటు సాగనుంది. ఆగస్టు 1వ తేదీన జెరూసలేం వెళ్లి, మళ్ళీ ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో, ముఖ్యమంత్రి యొక్క వ్యక్తిగత భద్రతా అధికారి జోషి మరియు స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జి) పోలీస్ సూపరింటెండెంట్ సెంథిల్ కుమార్ ముఖ్యమంత్రి జగన్ తో పాటు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో, జగన్ యేసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహేము మరియు ఇజ్రాయెల్ లోని ఇతర పవిత్ర స్థలాలనును సందర్శించనున్నారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడ జెరూసలెం సందర్శించారు.

[subscribe]
[youtube_video videoid=7b0hOzH3LyA]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =