ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. పలు కీలక బిల్లులకు ఆమోదం

AP Assembly Adjourned Indefinitely and House Approves For Several Important Bills, AP Assembly Adjourned Indefinitely, Assembly Approves Several Bills, Andhra Pradesh Legislative Assembly, Winter Session,AP Assembly Mansoon Session, Mango News, Mango News Telugu, AP Assembly Sessions, Monsoon session of Andhra Pradesh Legislature, AP Assembly Calendar , Monsoon Session of AP Legislature, Andhra Pradesh Legislative Assembly Sep15th, Monsoon Session, AP Assembly Session Latest News And Updates, YSR Congerss Paty, TDP Party, BJP Party, Janasena Party

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శాసనసభతో పాటు శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. నేడు సభలో చర్చల అనంతరం శాసనసభను నిర‌వ‌ధిక వాయిదా వేస్తునట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టబడిన అద్భుతమైన చట్టాలకు సమావేశాల్లో ఆమోదం లభించిందని, చట్టాలను ఆమోదించడంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సమావేశాల సందర్భంగా సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ మండిపడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీకి ఆయన సిఫారసు చేశారు. ప్రివిలేజ్ కమిటీ వెంటనే సమావేశమై రికార్డ్స్ చూసి వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. ఇక మరోవైపు ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా నిరవధిక వాయిదా వేశారు. శాసనసభలో ఆమోదించిన అన్ని బిల్లులకూ మండలిలో కూడా ఆమోదం లభించింది.

ఇక సమావేశాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వీటిపై స్వల్పకాలిక చర్చల అనంతరం సభ ఆమోదముద్ర వేసింది. పోలవరం ప్రాజెక్టు, విద్యారంగంలో నాడు-నేడు, వ్యవసాయం, ఆర్బీకేలు వంటి వాటిపై సభ్యులు కీలక చర్చించారు. ఈరోజు మొత్తం 9 బిల్లులు ప్రవేశపెట్టగా, ప్రధానంగా ఎన్టీఆర్ వర్శిటీని వైఎస్సార్ వర్సిటీగా పేరు మార్చుతూ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకి సభ ఆమోదం తెలిపింది. అలాగే సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుకి కూడా సభ ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు దీనిని రూపొందించారు. ఇక 2020-21 సంవత్సరానికి గాను కాగ్ ఇచ్చిన నివేదికను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల ఆమోదం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ వాటి అవసరాన్ని వివరించారు. ఈ సమావేశాలలో సహకరించిన సభ్యులందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =