ఆదాయ సర్టిఫికెట్ కాలపరిమితి నాలుగేళ్లకు పెంపు – డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

Amaravati, AP Deputy CM, AP News, AP Political Updates, AP Revenue Minister, Dharmana Krishna Das, Dharmana Krishna Das Take Charge as Deputy Chief Minister, Dharmana Krishna Das Take Charge as Deputy CM, Dharmana Krishndas, Revenue Minister

ఇటీవలే ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటీ ముఖ్యమంత్రిగా, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 25, శనివారం నాడు సచివాలయంలోని ఐదో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన పత్రాలపై ఆయన తోలి సంతకం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికీ ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం ఉండదని తెలిపారు. అదేవిధంగా ఇతరులు ఒకసారి ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకుంటే ఇకపై నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అవుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖలో అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిగేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్ నమ్మకం నిలబెట్టేలా పనిచేస్తానని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 10 =