వైఎస్ వివేకా హత్య కేసు: భాస్కర్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని సూచన

Ex Minister Vivekananda Reddy Assassination Case CBI Serves Notices to YS Bhaskar Reddy Once Again,Vivekananda Reddy CBI Case,Ex Minister Vivekananda Reddy Assassination Case,CBI Serves Notices to YS Bhaskar Reddy,Mango News, Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,Janasena Chief Pawan Kalyan,AP Bjp Chief Somu Verraju,YSR Congress Party,Telugu Desam Party,Janasena Party,BJP Party,YSR Party,TDP Party,JSP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates, Andhra Pradesh Latest Investments, Andhra pradesh Politics,AP Governer,AP Cabinet Minister,AP Ministers,Andhra Pradesh Welfare Schemes,AP CM Jagan Latest News and Live Updates

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పులివెందులలోని భాస్కర్‌ రెడ్డి ఇంటి వద్ద సదరు నోటీసులు అందజేసింది. సీఆర్‌పీసీ 160 కింద భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ, కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌లో ఈనెల 12న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా ఇదే కేసుకు సంబంధించి గత నెల 18న మొదటిసారిగా భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ 23న విచారణకు రావాలని కోరింది. అయితే అప్పటికే నిర్ణయించుకున్న పలు కార్యక్రమాల వలన ఆ రోజున విచారణకు రాలేనని భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారమిచ్చారు.

కాగా ఈ క్రమంలో ఫిబ్రవరి 25వ తేదీన విచారణ నిమిత్తం వైఎస్ భాస్కర్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిలను ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అలాగే సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి మరియు ఆయన సతీమణి భారతి పీఏ నవీన్‌లను కూడా విచారించింది. కాగా వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని కుట్రదారుడిగా పేర్కొన్న సీబీఐ, వివేకా హత్య గురించి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు ముందే తెలుసని కూడా సీబీఐ పిటిషన్‌లో కోర్టుకు తెలిపింది. ఇక 2019 మార్చి 19వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 9 =