ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

ICC Mens Test Bowling Rankings India Spinner Ravichandran Ashwin Becomes the New NO1 Ranked Test bowler,ICC Mens Test Bowling Rankings,India Spinner Ravichandran Ashwin,Ashwin Becomes the Ranked Test bowler,New NO1 Ranked Test bowler,Mango News,Mango News Telugu,Ravichandran Ashwin Test Wickets,Ashwin Spinner,Ashwin Test Wickets In India,Ashwin Total Test Wickets,Indian Spinner Ashwin,Ravichandran Ashwin Age,Ravichandran Ashwin Century,Ravichandran Ashwin Spin,Ravichandran Ashwin Test Career,Ravichandran Ashwin Wickets

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో టెస్ట్ ర్యాంకింగ్స్ ను అప్డేట్ చేసింది. ఈ నేపథ్యంలో టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్పిన్నర్, బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్​ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాపై జరిగిన మొదటి, రెండో టెస్టులలో భారత్ ఘన విజయం సాధించగా, అశ్విన్ ఎనిమిది మరియు ఆరు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 864 రేటింగ్ పాయింట్స్ తో నిలిచి ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాకింగ్స్ లో టాప్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటివరకు నెంబర్ 1 స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ​ను దాటుకుని అశ్విన్ టెస్ట్ బౌలర్‌ గా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే 2015లో అశ్విన్ మొదటిసారి నెంబర్ 1 ర్యాంక్ టెస్ట్ బౌలర్‌ గా నిలవగా, ఆ తర్వాత అనేక సందర్భాల్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆండర్సన్ 859 రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ 858 పాయింట్స్ మూడో స్థానంలో ఉన్నారు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రవీంద్ర జడేజా 10 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు, అలాగే టెస్ట్ ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టెస్టుల్లో బౌలింగ్ విభాగానికి సంబంధించి టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో అశ్విన్, జడేజాతో పాటుగా భారత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4 స్థానంలో (795 పాయింట్స్) కొనసాగుతున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + seven =