మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. కుమార్తె వివాహానికి ఆహ్వానం

Former CBI JD Lakshmi Narayana Meets Megastar Chiranjeevi To Invite For His Daughter Wedding,Former CBI JD Lakshmi Narayana Meets Megastar,JD Lakshmi Narayana Meets Megastar Chiranjeevi,JD Lakshmi Narayana To Invite For His Daughter Wedding,Former CBI Meets Megastar,Lakshmi Narayana Meets Megastar For Wedding,Mango News,Mango News Telugu,JD Lakshmi Narayana Daughter Wedding,JD Lakshmi Narayana,Former CBI JD Lakshmi Narayana Latest News,JD Lakshmi Narayana Latest Updates,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi Latest Updates,JD Lakshmi Narayana Daughter Wedding News,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మంగళవారం భార్య ఊర్మిళతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లిన లక్ష్మీ నారాయణ తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు శుభలేఖ అందించారు. కాగా ప్రియాంక వివాహానికి లక్ష్మీనారాయణ పలువురు ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు. కాగా ప్రస్తుతం జేడీ కుమార్తె ప్రియాంక‌ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే గత కొద్దీ రోజులుగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతారని ప్రచారం జరుగుతుంది. లక్ష్మీ నారాయణతో పాటూ ఆమె కూడా విశాఖ నుంచి పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడిచింది. లక్ష్మీ నారాయణ లోక్‌సభ.. ప్రియాంక అసెంబ్లీకి బరిలో ఉంటారని ఊహాగానాలు వినిపించాయి. ఇక లక్ష్మీ నారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనది మాత్రం ఆయన వెల్లడించలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here