నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించిన సీఎం జగన్‌.. నూతన భవనం ప్రారంభం

CM YS Jagan Visits The Missionaries of Charity Nirmal Hruday Bhavan in Vijayawada Today,CM YS Jagan Visits The Missionaries of Charity,The Missionaries of Charity,Nirmal Hruday Bhavan in Vijayawada,CM YS Jagan Visits Nirmal Hruday Bhavan in Vijayawada,CM YS Jagan Visits Nirmal Hruday Bhavan,CM YS Jagan in Vijayawada Today,Mango News,Mango News Telugu,CM Jagan and YS Bharati at Missionaries of Charity,CM YS Jagan Latest News,CM YS Jagan Latest Updates,Nirmal Hruday Bhavan Latest News,Nirmal Hruday Bhavan Latest Updates,Vijayawada News Today,Vijayawada Latest News,AP CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (మంగళవారం, మే 30, 2023) విజయవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని రాఘవయ్య పార్క్ సమీపంలోని ప్రముఖ మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించారు. ఈ ఉదయం సతీమణి భారతితో కలిసి నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు వెళ్లిన సీఎం జగన్‌.. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు అనాథ పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. అలాగే ఆశ్రమంలోని దివ్యాంగులను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనాధ వృద్ధుల దగ్గరకు వెళ్లి పరామర్శించిన సీఎం జగన్‌ దంపతులు వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక నిర్మల్ హృదయ్ భవన్‌ను మిషనరీస్ ఆఫ్ చారిటీ గొప్పగా నిర్వహిస్తోందని సీఎం జగన్‌ కితాబునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస రావుతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here