ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలుకై బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ పై సీఎస్ సమీక్షా సమావేశం

CS Somesh Kumar held Review on Implementation of Business Reforms Action Plan for Ease of Doing Business, Ease Of Doing Business Initiatives, Ease Of Doing Business Initiatives , Business Reforms Action Plan, CS Somesh Kumar Review on Business Reforms Action Plan, Mango News, Mango News Telugu, Telangana CS Huge Incentives For Investment, Ease Of Doing Business Telangana, Telangana Ease Of Doing Business , CS Somesh Kumar Meet on Ease of Doing Business, CS Somesh Kumar IAS, Telangana IAS CS Somesh Kumar, CS Somesh Kumar Latest News And Updates

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ను పటిష్టంగా అమలు చేయడంలో పలు సంస్కరణలను చేపట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో (టాప్ అఛీవర్స్) నిలిపినందుకు ప్రభుత్వంలోని పలు శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అభినందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకై బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకై ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) సంస్కరణల్లో భాగంగా వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహాలకు అనుకూల విధానాలు ఉండేలా ప్రస్తుత నిబంధనల వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకువస్తున్నట్లు సీఎస్ తెలిపారు. మెరుగైన సమాచార మార్పిడి, పారదర్శకతకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు తమ శాఖల పనితీరులో సామర్థ్యాన్ని పెంపొందించుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని చెప్పారు. ఈఓడీబీ సంస్కరణల అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున, ఫలితాల ఆధారితంగా పూర్తి చేసేలా చూడాలని సీఎస్ అధికారులను కోరారు. ప్రస్తుత బిజినెస్ రూల్స్ యాక్షన్ ప్లాన్ ఈఓడీబీకి సంబంధించి 540 సంస్కరణలు అమలు చేస్తున్నట్టు సీఎస్ వెల్లడించారు . ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =