సూపర్‌స్టార్‌, ఘట్టమనేని కృష్ణ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది : నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Expressed his Grief on Demise of Super Star Krishna,Superstar Ghattamaneni Krishna Death,Nandamuri Balakrishna Condolences,Superstar Krishna Passes Away,Tollywood Senior Actor Krishna, Superstar Krishna Hospitalized,Superstar Krishna Illness,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

సూపర్‌స్టార్‌, ఘట్టమనేని కృష్ణ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రముఖ అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ అన్నారు. “కృష్ణ తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్న ఎన్టీఆర్, కృష్ణ కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటీవలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =