వారి కంచుకోటలు కూలతాయా?

Who Will Win In Nellore This Time?,Nellore District Winning Losing Predictions,Telugu News,TDP,YCP,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Nellore,Nellore Elections,Nellore Politics,Ponguru Narayana,YCP Mohammad Khaleel Ahmed,TDP Ponguru Narayana

ఎన్నికల వేళ జిల్లాల వారీగా విశ్లేషణలు మొదలయ్యాయి. గత 2019 ఎన్నికల్లో పలు జిల్లాలను వైసీపీ క్లీన్‌ స్వీప్ చేసింది. ఈ సారి ఆ పరిస్థితి ఉంటుందా అంటే కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో హోరాహోరీ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటిలోకి దిగుతుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వైసీపీ జనసేన సింగిల్‌గా బరిలోకి దిగాయి. అటు  జనసేన లెఫ్ట్‌ పార్టీలతో కలిసి దిగింది. ఈ ఎన్నికల్లో 2014 కూటమి రిపీట్ అయ్యింది. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, దాని పరిధిలోని ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పరిస్థితిని ఓ సారి విశ్లేషిద్దాం.

–>  నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్, టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీకి పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

–> ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థులపై భూకబ్జా ఆరోపణల కారణంగా ఆదాలకు పరిస్థితి కాస్త అనుకూలంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

–> ఆత్మకూరులో వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, టీడీపీ నుంచి ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపునకు పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.

–> ఉదయగిరిలో కూడా మేకపాటి కుటుంబానికి చెందిన వ్యక్తి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతం ఎవరు గెలుస్తారన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు విశ్లేషకులు.

–> కోవూరులో వైసీపీ నుంచి ఇటీవల ఫిరాయించిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీకి చెందిన వేమిరెడ్డి పరాశాంతిరెడ్డి మధ్య ఆసక్తికర పోరు ఉంది. పరశాంతి రెడ్డి ధనబల రాజకీయాలను తిప్పికొడితే తప్ప ఫలితం ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.

–> కావలిలో వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి మధ్య పోటీ నెలకొంది. ప్రతాప్ కుమార్ రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి.

–> గూడూరు (ఎస్సీ)లో టీడీపీ అభ్యర్థి పాశం సునీల్‌కుమార్‌ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ విజయం సాధించారన్న ప్రచారం రచ్చబండలపై సాగుతోంది.

–> వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి లక్ష్మీసాయిప్రియ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ పరిస్థితి వైసీపీకి కాస్త అనుకూలంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.

–> సూళ్లూరుపేట వైసీపీకి అడ్వాంటేజ్ ఉందన్న టాక్ నడుస్తోంది. వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య, టీడీపీ తరఫున డాక్టర్ విజయశ్రీ పోటీ చేస్తున్నారు.

–> మొత్తానికి నెల్లూరు రూరల్, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉందని అర్థమవుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + twenty =