బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Extends Birthday Wishes to BJP National President JP Nadda,Pawan Kalyan Wishes To JP Nadda,JP Nadda 62nd Birthday,JP Nadda Birthday,JP Nadda Birthday Latest News and Updates,BJP President JP Nadda,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జేపీ నడ్డాకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ, “విశాల భారతావనిని పరిపాలిస్తున్న జాతీయ రాజకీయ పక్షానికి నేతృత్వం వహిస్తున్నారంటే మీ శక్తియుక్తులు, రాజకీయ పటిమ, దీక్షాదక్షతలు ఎంతటివో అవగతమవుతుంది. మూడు పదుల ప్రాయంలోనే చట్టసభకు ఎన్నిక కావడం మీలోని రాజకీయ జిజ్ఞాసకు నిదర్శనం. న్యాయవాదిగా, మంత్రిగా, రాజకీయవేత్తగా మీరు సాధించిన విజయాలు నేటి తరానికి ఆదర్శప్రాయం. మీ కీర్తి ప్రతిష్టలు అజరామరంగా వెలుగొందాలని, మీకు సుసంపన్నమైన ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here