కడప సీబీఆర్ ప్రాజెక్ట్ వద్ద ‘జెట్టీ’ని ప్రారంభించిన సీఎం జగన్, సరదాగా చిత్రావతి నదిలో కొద్దిసేపు బోటింగ్

CM Jagan Boating in Chitravathi River After Launches Jetty at Kadapa CBR Project Today,CM Jagan Inaugurated Jetty,Kadapa CBR Project,Jagan Enjoyed Boating In River,Chitravati River Jagan,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సీబీఆర్ ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ‘బోటింగ్ జెట్టీ’ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం సరదాగా కొద్దిసేపు చిత్రావతి నదిలో బోటింగ్ చేశారు. ఆయనతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సహా పలువురు అధికారులు బోటింగ్ చేశారు. కాగా సీబీఆర్ ప్రాజెక్ట్ వద్ద బోటింగ్ జెట్టీతో పాటు టూరిజం పార్క్ మరియు వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ లను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. ఇక వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ వద్ద సీఎం జగన్ తన తండ్రి మరియు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మొత్తం పనుల విలువ దాదాపు రూ.6.50 కోట్లు అని అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here