వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా నియామకం

West Indies Cricketer Dwayne Bravo Announces IPL Retirement Appointed as Chennai Super Kings Bowling Coach,West Indies Cricketer Dwayne Bravo,Dwayne Bravo Retirement to IPL,Chennai Super Kings Bowling Coach,Dwayne Bravo West Indies Cricketer,Mango News,Mango News Telugu,West Indies Cricketer,Dwayne Bravo Latest News and Updates,Dwayne Bravo News and Live Updates,IPL Dwayne Bravo,Dwayne Bravo IPL,Chennai Super Kings,Dwayne Bravo Bowling Coach,Bowling Coach Chennai Super Kings,CSK Bowling Coach Dwayne Bravo

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్‌తో బంధం మాత్రం పూర్తిగా తెంచుకోలేదు. కేవలం ఆటగాడిగా మాత్రమే వైదొలిగాడు. కానీ తన ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో తానూ ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని బ్రావో తెలిపాడు. కాగా 2023 వేలానికి ముందు బ్రావోను సీఎస్‌కే ఇటీవల వదిలి పెట్టింది. ఇక బ్రావో మంచి ఆల్ రౌండర్‌గా గుర్తింపు ఉంది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండింటిలో రాణించడం అతని ఐపీఎల్‌ కెరీర్‌కు బాగా ఉపయోగపడింది.

కాగా డ్వేన్ బ్రావో2011 నుండి సీఎస్‌కేలో కొనసాగుతున్నాడు. భారత లెజెండ్ ఎంఎస్ ధోని నేతృత్వంలో పలుసార్లు సీఎస్‌కే ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్లలో డ్వేన్ బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. 2011, 2018 మరియు 2021లో ఆ జట్టు టైటిల్ విజయాల్లో భాగంగా ఉన్నాడు. అలాగే బ్రావో 161 మ్యాచ్‌లలో 183 వికెట్లు తీసి ప్రస్తుత ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత బౌలింగ్ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ దాదాపు ఏడాది విరామం తీసుకోవడంతో అతని స్థానంలో ఈ వెస్టిండీస్ ఆల్ రౌండర్‌ను సీఎస్‌కే తమ నూతన బౌలింగ్ కోచ్‌గా ప్రకటించింది.

ఇక తన రిటైర్మెంట్ నిర్ణయంపై బ్రావో మాట్లాడుతూ.. ‘నేను ఈ కొత్త ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మైదానంలో ఆటగాడి పాత్ర ముగిసిన తర్వాత నేను చేయబోయే ప్రయత్నం ఇది. ఇక ఇన్నేళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో ఆటను ఎంతో ఆస్వాదించాను. ఎంతోమంది టాలెంటెడ్ ఆటగాళ్లతో కలిసి ప్రయాణించాను. ఒక ఆటగాడిగా ఎంతో నేర్చుకున్నాను. ఐపీఎల్‌లో చాలామంది బౌలర్‌లతో కలిసి పనిచేశాను, అలాగే బౌలింగ్ నాకు ఎంతో ఇష్టమైన పాత్ర. ఆటగాడి నుండి కోచ్‌గా మారడం అనేది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే నేను ఎక్కువగా సర్దుకుపోవాల్సి ఉంటుందని అనుకోవడం లేదు. ఎందుకంటే టీమ్ మెంబర్స్ అందరితో నాకు అనుబంధం ఉంది. ఇక బ్యాట్స్‌మెన్ కంటే ఒక అడుగు ముందుకు ఎలా ఉండాలనే దానిపై ప్రణాళికలు మరియు ఆలోచనలను రూపొందించడానికి బౌలర్లతో కలిసి పని చేస్తాను. ఒకటే తేడా, ఏమిటంటే.. ఇకపై నేను మిడ్-ఆన్ లేదా మిడ్-ఆఫ్‌లో నిలబడలేను. ఐపీఎల్ చరిత్రలో నేనే ప్రముఖ వికెట్ టేకర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఐపీఎల్ చరిత్రలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + sixteen =