బీజేపీలో చేరడం లేదు – జేసి దివాకర్ రెడ్డి

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, JC Diwakar Reddy About Joining In BJP, JC Diwakar Reddy Says BJP Future In AP, JC Diwakar Reddy Says BJP Future In AP Depends On The Chandrababu, JC Diwakar Reddy Says BJP Future In AP Depends On The Chandrababu Actions, Mango News Telugu

టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ప్రస్తుత రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. శనివారం నాడు కడపలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం మొదలయిందని, ఆ ప్రభంజనం ఎక్కువవుతుందా, తక్కువవుతుందా అనే దానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాత్ర కూడ పరోక్షంగా ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలపైనే ప్రాంతీయ పార్టీల భవిష్యత్ ఆధారపడివుందని, దేశంలో జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతాయని తాను భావిస్తున్నానని చెప్పారు.

పరిచయాలు ఉండటం వలనే బీజేపీ నాయకులను కలుస్తుంటానని, మాట్లాడితేనే పార్టీలో చేరినట్టు కాదని బీజేపీలో చేరే ఉద్దేశం లేదని చెప్పారు. జమిలి ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పుంజుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఆలోచనలపైనే ఆధారపడాల్సి ఉంటుందని చెప్పారు. టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలో బీజేపీ పార్టీలోకి చేరబోతున్నారు అని వార్తల వస్తున్న నేపథ్యంలో జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eighteen =