అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళనలు, 144 సెక్షన్ విధించిన పోలీసులు

AP Protests Against Govt at Amalapuram on Name Change Issue For Konaseema District, Protests Against AP Govt at Amalapuram on Name Change Issue For Konaseema District, Name Change Issue For Konaseema District, Protests Against AP Govt at Amalapuram, AP Protests Against Govt at Amalapuram, youths staged protests against changing the name of Konaseema district, name of Konaseema district, Amalapuram, AP Protests Against Govt, Protests Against AP Govt, Konaseema district News, Konaseema district Latest News, Konaseema district Latest Updates, Konaseema district Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని నిరసిస్తూ మంగళవారం వందలాది మంది యువకులు నిరసనలు చేపట్టడం, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. అమలాపురం పట్టణంలోకి భారీగా చేరుకున్న జేఏసీ నేతలు, జిల్లా సాధన సమితి నాయకులు, యువకులు ప్రధాన కూడళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో.. పెద్ద ఎత్తున యువకులు క్లాక్‌ టవర్‌ జంక్షన్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిలో కొందరు తప్పించుకుని కలెక్టరేట్ వైపు పరుగులు తీయడంతో పోలీసులు వెంబడించారు.

ఈ క్రమంలో కలెక్టరేట్ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది తీవ్రతరం కావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణంగా మారింది. యువకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొందరు యువకులు అటుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టారు. అలాగే పోలీసులపై కూడా రాళ్లు రువ్వడంతో ఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీ, గన్ మెన్లతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అటు పోలీసు వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. అయితే ఇంటి నుంచి మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు రహస్యంగా తరలించారు. మంత్రి ఇంటి సమీపంలో మూడు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు నిరసనకారులు.

ప్రస్తుతం అమలాపురంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. కోనసీమ జిల్లాకు ప్రజల అభీష్టం మేరకు అంబేడ్కర్ పేరు పెట్టామని, అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కోనసీమ జిల్లా పేరును ‘డా. బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా’గా పేరు మారుస్తున్నామని, ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు కానీ, సూచనలు కానీ ఉంటే 30 రోజుల్లోగా కలెక్టర్‌కు సమర్పించాలని కోరారు. కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కోరుతున్న కొందరు యువకులు డిమాండ్ చేస్తూ బుధవారం ఆందోళనకు దిగారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =