మరికొద్దిసేపట్లో ఐపీఎల్‌-2022 క్వాలిఫైయర్-1 మ్యాచ్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తర పోరు

IPL-2022 Qualifier 1 Match Between Gujarat Titans and Rajasthan Royals Today, IPL-2022 Qualifier 1 Match Between Rajasthan Royals and Gujarat Titans Today, Qualifier 1 Match Between Rajasthan Royals and Gujarat Titans Today, Qualifier 1 Match Between Gujarat Titans and Rajasthan Royals Today, Rajasthan Royals and Gujarat Titans, Gujarat Titans and Rajasthan Royals, IPL-2022 Qualifier 1 Match, Qualifier 1 Match, Rajasthan Royals, Gujarat Titans, Qualifier 1, IPL-2022, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022లో నేటి నుంచి ప్లే ఆప్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్లే ఆప్స్ లో భాగంగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు నేరుగా ఐపీఎల్-2022 ఫైనల్ కు చేరుకోనుంది. ఓడిపోయిన జట్టు ఫైనల్ చేరేందుకు మరో అవకాశంగా మే 27న క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడనుంది.

గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ ఏడాదే ఐపీఎల్ లో కొత్తగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహరిస్తుండగా, ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ జట్టు సంచలన విజయాలను నమోదు చేసింది. ఐపీఎల్‌-2022లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. మొత్తం 14 లీగ్ మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్ 10 విజయాలు సాధించి 20 పాయింట్స్, +0.316 నెట్ రన్ రేటుతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

గుజరాత్ టైటాన్స్ జట్టులో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, శుబ్ మన్ గిల్, రాహుల్ తేవాటియా బ్యాటింగ్ లో రాణిస్తుండగా, మహమ్మద్ షమి, రషీద్ ఖాన్, యాష్ దయాల్ బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు. మరో వైపు రాజస్థాన్ రాయల్స్ 14 లీగ్ మ్యాచుల్లో 9 విజయాలు సాధించి 18 పాయింట్స్, +0.298 నెట్ రన్ రేటుతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాజస్థాన్ జట్టులో జొస్ బట్లర్‌, కెప్టెన్ సంజు శాంసన్‌, హెట్‌మయర్‌, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ లో మెరుస్తుండగా, అశ్విన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో నిలకడగా రాణిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇరు జట్లు అంచనాలకు మించి రాణిస్తుండడంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకుంది. ముందుగా ఫైనల్ కు ఏ జట్టు వెళుతుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

గుజరాత్ టైటాన్స్ : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యాష్ దయాళ్.

రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, యజ్వేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =