గ్రామా, వార్డు సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు సన్నద్ధం కావాలి : సీఎం వైఎస్ జగన్‌

Andhra Pradesh, Andhra Pradesh Registrations, AP CM YS Jagan, AP Registration Process in Village Ward Secretariats, CM YS Jagan Ordered Officials to Start Registration Process, CM YS Jagan Ordered Officials to Start Registration Process in Village Ward Secretariats, Mango News, Property registration, Property registration at ward level, Registration Process in Village Ward Secretariats, registration services in ward village secretariats, Start land registration at village level, village secretariats

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామా, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సన్నద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజలకు రిజిస్ట్రేషన్‌ సేవలు చేరువ కావడమే కాకుండా, గ్రామా, వార్డు సచివాలయాల పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అలాగే ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు కూడా ఆస్కారం ఉండదని సీఎం పేర్కొన్నారు.

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ‘క్లాప్‌’ కార్యక్రమం, విశాఖపట్నంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా సీఎం సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో మరియు నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని, పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్ల మరమ్మతును ప్రాధాన్యతగా చేపట్టాలని సూచించారు. మరోవైపు అనుకున్నషెడ్యూల్‌ ప్రకారమే టిడ్కో ఇళ్లు పూర్తి చేసి, 45 వేలకు పైగా ఇళ్లను మూడు నెలలలోగా, మిగిలిన ఇళ్లను డిసెంబరులోగా అప్పగించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తిచేయడానికి కూడా వెంటనే కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here