ఆంధ్రప్రదేశ్ లో మరో జపాన్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Minister Mekapati Goutham Reddy Says Another Japan Industrial Township Coming up in AP,Second Japan Industrial Township For APMooted At Chittoor,Minister Goutham Reddy,Minister Mekapati Goutham Reddy,Mekapati Goutham Reddy,Japan Industrial Township Coming up in AP,AP,AP Latest News,Andra Pradesh,Andhra Pradesh News,Japanese Industrial Township Likely To Be Set Up In AP State,Japan Industrial Township,Japan Industrial Township in Andhra Pradesh,Mango News,Mango News Telugu,Second Japan Industrial Township For AP,Minister Goutham Reddy Press Meet,Japan,Second Japan Industrial Township,JIT,Andra Pradesh Minister Mekapati Goutham Reddy

ఆంధ్రప్రదేశ్ లో మరో జపాన్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ రాబోతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. గురువారం నాడు జరిగిన జపాన్‌ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పటి నుంచో జపాన్ తో ఆంధ్రప్రదేశ్ కు మంచి అనుబంధం ఉందని అన్నారు. విశాఖపట్నంలో 10 లక్షల చదరపు అడుగుల్లో ‘జపనీస్‌ ఎన్‌క్లేవ్‌’ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్‌ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా ‘జపాన్‌ డెస్క్‌ ఏర్పాటు’ చేయనున్నట్టు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు

ఇప్పటికే ఏపీలో కొలువైన ఏటీసీ టైర్స్, యొకొహొమా గ్రూప్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు రాబోతున్నాయని యువతకు స్పష్టం చేశారు. ఒక్క వాహనాల టైర్ల తయారీలోనే 2000 మందికి ఉపాధి, యువతకు శిక్షణ అందించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీసిటీలో భారీ స్థాయిలో ఏర్పాటైన జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ లో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (విసీఐసీ) అభివృద్ధిలో భాగంగా మరో జపాన్ పారిశ్రామిక టౌన్ షిప్ కు ప్రతిపాదించామని తెలిపారు.

కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు వున్న 2,500 కి.మీ తూర్పు తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఈస్ట్‌ కోస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను మూడు దశల్లో అభివృద్ది చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని అందులో భాగంగా తొలిదశలో విశాఖ చెన్నై కారిడార్‌ అభివృద్ధి చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే చిత్తూరులో జపాన్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటుకు సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 25కిపైగా జపాన్‌ కంపెనీల పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. మరిన్ని రంగాలలో జపాన్ పరిశ్రమల నుంచి పెట్టుబడులు ఆకర్షణ కోసం జపాన్-ఇండియా తయారీ సంస్థ(జేఐఎం-జపాన్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మానుఫ్యాక్చరింగ్) ఏర్పాటు పూర్తి చేయనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =