జేఈఈ మెయిన్‌-2021‌ పరీక్షషెడ్యూల్ విడుదల, 13 భాషల్లో నిర్వహణ

Union Education Minister Ramesh Pokhriyal Announces JEE Main-2021 Schedule,JEE Main 2021 New Exam Dates Announced By Education Minister,JEE Mains 2021 Exam Date Announced By Ramesh Pokhriyal nishank,JEE Main 2021 Dates,JEE Mains 2021 New Schedule,JEE Mains 2021 New Dates,JEE Mains 2021 Education Minister Announcement,JEE Mains 2021,JEE Mains 2021 Notification,JEE Mains 2021 Dates announced,JEE Mains 2021 Dates,JEE Mains 2021 Pattern,JEE Mains 2021 Registration Last Date,JEE Mains 2021 Syllabus,Union Education Minister Ramesh Pokhriyal,Ramesh Pokhriyal,Ramesh Pokhriyal Announces JEE Main-2021 Schedule,Education Minister,JEE Main 2021,JEE Main 2021,Mango News,Mango News Telugu

దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021‌ పరీక్ష షెడ్యూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ బుధవారం నాడు ప్రకటించారు. 2021 సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగు సెషన్లలో నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. మొదటి సెషన్ ను ఫిబ్రవరి 23, 2021 నుండి 26 వరకు జరుగుతుందని చెప్పారు. జేఈఈ మెయిన్-2021 పరీక్షను తొలిసారిగా అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మరియు గుజరాతీ వంటి 13 భాషల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

నాలుగు సెషన్లలో కూడా జరిగే పరీక్షలకు అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కానవసరం లేదని మంత్రి తెలియజేశారు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ సెషన్లలో పరీక్షకు హాజరైతే ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటిని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరిగణనలోకి తీసుకుంటుందని ప్రకటించారు. అలాగే ఈసారి ప్రశ్నపత్రంలో 90 ప్రశ్నలు ఉంటాయని, ఇందులో అభ్యర్థి మొత్తం 75 ప్రశ్నలను సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. జేఈఈ మెయిన్ పరీక్షను నాలుగు సెషన్లలో నిర్వహించడం వలన అభ్యర్థులు ఓసారి మంచి ఫలితం సాధించకపోయితే తర్వాతి పరీక్షల్లో వారి స్కోర్లు మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయని మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here