ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని

AP Assembly 2019, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, APSRTC Latest News, Mango News Telugu, Minister Perni Nani, RTC Merger Bill In AP Assembly, RTC Merger With Government
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 16, సోమవారం నాడు ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టగా, వాటిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ విలీనం బిల్లును రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చట్టం తెస్తున్నామని తెలియజేశారు. మహా సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేసిన పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితులు, కష్టాలను సీఎం వైఎస్ జగన్‌ ప్రత్యక్షంగా చూశారని, ఆ సందర్భంలోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగభద్రత కోసమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే ఈ రోజు సమావేశాల్లో ముందుగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సుదీర్ఘమైన చర్చ జరిగిన అనంతరం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. మద్యపాన నిషేధంపై ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఉండే ఈ బిల్లు ఆమోదించబడడంతో వైసీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here