ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLC Elections Polling Under Way in AP And Telangana,MLC Elections Polling,Polling Under Way in AP,MLC Polling Under Way in Telangana,AP And Telangana MLC Elections,Mango News,Mango News Telugu,Campaigning ends for MLC polls,Process For MLC Graduates,Campaigning ends for MLC,Telangana MLC Elections Latest News,AP MLC Elections News,Telangana Elections Latest Updates,Andhra Pradesh Election Latest News,Telangana Latest News And Updates,Telangana Political News And Updates,AP Politics

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సోమవారం 4 స్థానిక సంస్థల, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. స్థానిక సంస్థల కోటా కింద శ్రీకాకుళం, కర్నూలులలో ఒక్కో ఎమ్మెల్సీ స్థాస్థానానికి, పశ్చిమగోదావరిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, అలాగే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మరియు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 08.00 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 04.00 వరకు కొనసాగనుంది. కాగా మార్చి 16న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.

ముందుగా ఏపీలో స్థానిక సంస్థల కోటా కింద అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలులో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, పశ్చిమగోదావరిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం నుంచి ఎస్.మంగమ్మ, కడప నుంచి పి.రామసుబ్బారెడ్డి, నెల్లూరు నుంచి మేరుగ మురళీధర్, తూర్పుగోదావరి నుంచి కుడుపూడి సూర్యనారాయణ, చిత్తూరు నుంచి సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే మిగిలిన స్థానిక సంస్థల స్థానాలతో పాటుగా, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో 21 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 137 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను మార్చి 16న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

ముందుగా తెలంగాణలో స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ స్థానానికి, మహబూబ్‌నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌ బేగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మిత్రపక్షం అయిన ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందిస్తూ, ఈ ఎమ్మెల్సీ బరిలో ఉండే ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. దీంతో హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మీర్జా రహమత్‌ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మిగిలిన మహబూబ్‌నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నేడు పోలింగ్ జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =