జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నూతన సభ్యులు నియామకం

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Janasena Political Affairs Committee, Janasena Political Affairs Committee New Members, Mango News Telugu, Pawan Kalyan Announced Janasena Political Affairs Committee, Pawan Kalyan Announced Janasena Political Affairs Committee New Members, Pawan Kalyan Janasena Latest News, Political Affairs Committee New Members

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 6, బుధవారం నాడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని మరింతగా విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కొత్త సభ్యులను పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. పంతం నానాజీ, మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పితాని బాలకృష్ణలను పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా నియమించిన పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీరి పేర్లను ప్రకటించారు. అదేవిధంగా పార్టీ అధికారిక ప్రతినిధులుగా సుజాత పాండా, సుందరాపు విజయకుమార్, పర్చూరి భాస్కర్ రావులను నియమిస్తున్నట్టు ప్రకటించారు.

అలాగే రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై నవంబరు 3న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన శివశంకర్ తమ్మిరెడ్డి, సత్య బొలిశెట్టికి కృతజ్ఞతలు చెప్తూ, త్వరలోనే వారికీ పార్టీలో కీలకపదవులు అప్పగిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తక్కువ సమయంలోనే అన్ని ఏర్పాట్లు చేసి ‘లాంగ్ మార్చ్’ ను గొప్పగా విజయవంతం చేసినందుకు పార్టీ నాయకులకు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు, వారి నిబద్ధత, సహకారం మరియు సమన్వయం లేకుంటే కార్యక్రమం ఇంత ఘనంగా జరిగేదికాదని పేర్కొన్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − six =