చరిత్ర సృష్టించిన పీవీ సింధు

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, BWF World Championships Final, Mango News, Mango News Telugu, PV Sindhu Creates History, PV Sindhu Creates History Wins World Badminton Championship Gold, PV Sindhu Wins BWF World Championships Final, PV Sindhu Wins World Badminton, PV Sindhu Wins World Badminton Championship, PV Sindhu Wins World Badminton Championship Gold

ప్రపంచ బ్యాడ్మింటన్‌ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్తగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్ లో జపాన్ షట్లర్ ఓకుహర పై 21-7, 21-7 పాయింట్స్ తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. 2013, 2014 వ సంవత్సరాలలో కాంస్య పతకం, 2017, 2018 లలో రజత పతకం సాధించిన సింధు, ఈసారి స్వర్ణ పతకం సాధించి అరుదైన ఘనత సాధించింది. ఈ ఘన విజయంతో 42 సంవత్సరాల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు(స్వర్ణం, 2 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు) గెలుచుకున్న చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ పేరిట ఉన్న రికార్డును పీవీ సింధు సమం చేసింది.

ఆట మొదలైన దగ్గర నుంచి ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తోలి పాయింట్ నుండి చివరి పాయింట్ వరకు దూకుడుగానే ఆడింది. తోలి రౌండ్లో వరుసగా రెండు సార్లు 8 పాయింట్స్ గెలుచుకుని 16 నిమిషాల్లోనే తోలి గేమ్ ను దక్కించుకుంది. రెండో రౌండు లోనూ మొదటినుంచే పాయింట్స్ సాధిస్తూ తన చిరకాల ప్రత్యర్థి ఒకుహర పై ఒత్తిడి పెంచింది. రెండో రౌండ్ విరామ సమయానికే 11-4 తో పైచేయి సాధించి అదే ఊపుతో 21-7 తో విజేతగా నిలిచింది. మరో వైపు పురుషుల సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్ కాంస్య పతకం సాధించాడు. స్వర్ణం సాధించిన సింధును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రముఖ క్రీడాకారులు, సినీ సెలెబ్రిటీలు మన దేశం గర్వించేలా చేసావని శుభాకాంక్షలు తెలియజేసారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =