కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర, పోలీసుల అదుపులో ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు

Congress March to Rashtrapati Bhavan Stopped,Priyanka Gandhi and others Taken into Custody,Priyanka Gandhi Vadra,Priyanka Gandhi,Priyanka Gandhi News,Priyanka Gandhi Gets Notice,Priyanka Gandhi Latest News,Priyanka Gandhi Eviction Latest News Updates,Priyanka Gandhi Eviction,Priyanka Gandhi To Move To Lucknow,Congress March To Rashtrapati Bhavan Stopped,Priyanka Gandhi Taken Into Custody,Congress March To President Stopped,Mango News,Mango News Telugu,Farmers Protest,Farmers Protest Latest News,Congress March To Rashtrapati Bhavan Against Farm Laws,Farmers Protest Live Updates,Priyanka Gandhi Taken into Custody,Congress,Congress March,Priyanka Gandhi Detained During Protest,Rahul Gandhi Meets President,Rahul Gandhi

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాదయాత్రగా బయలుదేరారు. అయితే కాంగ్రెస్ నాయకుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రపతి భవన్‌ కు వెళ్లేందుకు అనుమతి ఉన్నవారిని మాత్రమే వెళ్లనిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ధర్నా చేపట్టారు.

ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ధర్నా చేపడుతున్నారంటూ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌ తో పాటుగా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ఐదుగురు కాంగ్రెస్‌ నేతల బృందం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సేకరించిన 2 కోట్ల సంతకాల పత్రాలు, అలాగే చట్టాలను రద్దు చేయడానికి జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వారు వినతిపత్రం అందజేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =