ఏపీ సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, latest sports news 2019, Mango News Telugu, PV Sindhu Meets AP CM YS Jagan, PV Sindhu Meets AP CM YS Jagan In Amaravati, sports news, World Badminton Championship Winner, World Badminton Championship Winner PV Sindhu

ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. సచివాలయంలో సీఎం జగన్ ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేసారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎంను కలిసిన వారిలో సింధుతో పాటు ఆమె తల్లితండ్రులు, మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు.

అనంతరం విలేకర్లతో మాట్లాడిన పీవీ సింధు, సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశానని, బాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచినందుకు అభినందనలు తెలిపిపారని చెప్పారు. ఈ సందర్భంగా వైజాగ్ లో బాడ్మింటన్ అకాడమీ కోసం ఐదు ఎకరాలు కేటాయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. క్రీడాశాఖ తన పేరును పద్మభూషణ్ అవార్డు కోసం ప్రతిపాదించడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. మరో వైపు ఈ రోజు రాష్ట్ర క్రీడాసంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో పీవీ సింధు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=Kt3Jt9iksZg]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − four =