మూడు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

Chandrababu Announced Candidates for Three key Positions, Three key Positions, Chandrababu Announced Candidates, Candidates Announced, TDP, Chandrababu Naidu, AP Elections, TDP Candidates, Latest Chandrababu Candidates Announced News, TDP Candidates Announced, YS Jagan, Andra Pradesh, Political News, Assembly Elections, Mango News, Mango News Telugu
TDP, Chandrababu Naidu, AP Elections, TDP Candidates

ఏపీలో ఎన్నికలవేళ ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నాలుగు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అటు జనసేన, తెలుగు దేశం పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. త్వరలోనే ఆ పార్టీల జాబితాలు వెలువడనున్నాయని వార్తలొస్తున్న క్రమంలో.. మూడు కీలకమైన స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రా.. కదలి రా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా గుడివాడలో నిర్వహించిన బహిరంగ సభలో కృష్ణా జిల్లాకు చెందిన మూడు కీలక నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. గుడివాడలో వెనిగండ్ల రామును.. మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను.. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావును గెలిపించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కీలకమైన మూడు నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు ప్రకటనతో ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయడం లేదనే విషయం స్పష్టంగా తేలిపోయింది. అయితే కొద్దిరోజులుగా మచిలీపట్నం నియోజకవర్గాన్ని చంద్రబాబు జనసేనకు కేటాయించారని ప్రచారం జరిగింది. ఆ స్థానం నుంచి జనసేన తరుపున రామకృష్ణ పోటీ చేస్తారని.. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టారని గుసగుసలు వినిపించాయి. అటు వైసీపీ తరుపున మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేస్తారని తెలుస్తోంది. వైసీపీ అయిదవ జాబితా లేదా ఆ తర్వతి జాబితాలో కిట్టు పేరు ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఈక్రమంలో మచిలీపట్నం నుంచి పోటీ చేసి పేర్ని కిట్టును ఎలాగైనా మట్టికరిపించాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుందట. అయితే ఇంతలోనే చంద్రబాబు మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర పేరును ప్రకటించారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 12 =