‘ఆర్ఆర్ఆర్’లో విలన్‌గా నటించిన రే స్టీవెన్సన్ హఠాన్మరణం.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంతాపం

RRR Movie Fame Ray Stevenson Passes Away Director SS Rajamouli Mourns For His Loss,RRR Movie Fame Ray Stevenson Passes Away,Director SS Rajamouli Mourns For His Loss,Director SS Rajamouli Mourns For Ray Stevenson,SS Rajamouli Mourns For Ray Stevenson Loss,Mango News,Mango News Telugu,Ray Stevenson,Director SS Rajamouli,SS Rajamouli,RRR Movie Ray Stevenson,RRR Ray Stevenson,SS Rajamouli mourns the loss of RRR actor,SS Rajamouli Pays Emotional Tribute,Ray Stevenson Latest News,Ray Stevenson Latest Updates,Ray Stevenson Live News,Director SS Rajamouli Latest News,Director SS Rajamouli Latest Updates,RRR Movie Fame Ray Stevenson News Today

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సూపర్ హిట్ తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్‘ లో విలన్‌గా నటించిన రే స్టీవెన్సన్ కన్నుమూశారు. అయితే 58 ఏళ్ల స్టీవెన్‌సన్‌ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆ సినిమాలో బ్రిటీష్ గవర్నరుగా స్టీవెన్సన్ చూపించిన తనదైన క్లాసిక్ విలనిజం అభిమానులను ఆకట్టుకుంది. కాగా రే స్టీవెన్సన్ మృతిపట్ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేసింది. అలాగే చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్టీవెన్సన్ మృతిపట్ల స్పందించారు. ఈ సందర్భంగా సినిమా సమయంలో ఆయనతో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఇంకా ట్విట్టర్ లో ఇలా తెలిపారు.. ‘షాకింగ్.. ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. రే తనతో సెట్స్‌కు చాలా శక్తిని మరియు చైతన్యాన్ని తీసుకువచ్చాడు. అతనితో పని చేయడం గొప్ప విషయం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు’ అని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌లో నటుడు స్టీవెన్సన్ ప్రతికూల పాత్రను పోషించారు. చిత్రంలో జాత్యహంకార మరియు క్రూరమైన గవర్నర్ స్కాట్ బక్‌స్టన్‌ పాత్రలో నటిచిన విషయం తెలిసిందే.

కాగా స్టీవెన్సన్ ఉత్తర ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో 1964 మే 25న జన్మించారు. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో చదివిన అనంతరం 29 ఏళ్ల వయస్సులో 1990ల్లో టీవీ షోల్లో నటించడం మొదలు పెట్టారు. కొన్నేళ్లపాటు బ్రిటిష్ టెలివిజన్‌లో పనిచేసిన స్టీవెన్సన్‌.. 1998లో పాల్‌ గ్రీన్‌గ్రాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ద థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పాల్ గ్రీన్‌గ్రాస్ 1998లో వచ్చిన ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. ఇక ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌ ఇన్‌ 1999, కింగ్‌ ఆర్థర్‌, పనిషర్‌ వార్‌ జోన్‌, బుక్‌ ఆఫ్‌ ఎలీ, ది అదర్‌ గాయ్స్‌, జో రిటాలియేషన్‌, డివర్జెంట్‌, ది ట్రాన్స్‌పోర్టర్‌: రిప్యూల్డ్‌, య్యాక్సిడెంట్‌ మ్యాన్‌, మెమొరీ తదితర సినిమాల్లో నటించారు. ప్రముఖ హాలీవుడ్ సినిమా ‘థోర్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక స్టీవెన్‌సన్‌, ఇటాలియన్ మానవ శాస్త్రవేత్త ఎలిసబెట్టా కరాసియా దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here