తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1,061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.. నియామక పత్రాలు అందజేసిన మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Gives Appointment Letters For 1061 Assistant Professors in Telangana Health Department,Minister Harish Rao Gives Appointment Letters,Appointment Letters For 1061 Assistant Professors,Assistant Professors in Telangana Health Department,Mango News,Telangana Health Department,Assistant Professors,Assistant Professors in Telangana,Minister Harish Rao,Minister Harish Rao Appointment Letters,Minister Harish Rao Latest News,Minister Harish Rao Latest Updates,Minister Harish Rao Live News,Telangana Assistant Professors News Today,Assistant Professors Appointment Latest News,Assistant Professors Appointment Latest Updates

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా నియమితులైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు నియామక పత్రాలను అందజేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో వీరికి నియామక పత్రాలను అందించిన అనంతరం మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేష్‌ రెడ్డి, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఏర్పాటు చేస్తున్నారని, దీనిలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రుల్లో సేవలందించడానికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వైద్య శాఖకు రూ.12,364 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, అంతేకాకుండా మందులు, పరికరాల వివరాలను అన్నీ ఆన్‌లైన్‌తో అనుసంధానించామని, వాటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని వెల్లడించారు.

కాగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను కేవలం 5 నెలల వ్యవధిలోనే అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని, కొత్తగా రిక్రూట్ అయిన వారందరూ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇక గత నెలలో శిల్పకళా వేదికగానే 969 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు నియామక పత్రాలు అందజేశామని గుర్తు చేసిన ఆయన మరో 5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని, త్వరలోనే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పారు. అలాగే వైద్య శాఖలోని ఏడు విభాగాలకు చెందిన 1,331 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించామని, ఈ విధంగా గడిచిన తొమ్మిదేళ్లలో మొత్తం 22,263 పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు. దేశాన్ని కాపాడే సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులు ఎంతో గొప్పవారన్న మంత్రి, ఈ వృత్తికి మరింత గౌరవాన్ని పెంచాలని వైద్యులకు సూచించారు. ఔషధాలు వ్యాధిని తగ్గించగలవని, కానీ డాక్టర్లు మత్రమే రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయగలరని, అందుకే ఎన్ని మందులు ఇచ్చామనే దానికంటే, మీరు ప్రేమగా మాట్లాడే మాట, ఇచ్చే ధైర్యం సగం రోగాన్ని తగ్గిస్తాయని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 15 =